రాజ్ భవన్ లో ఎట్ హోం.. హాజరైన కేసీఆర్

  • ‘ఎట్ హోం’కు హాజరుకాని ఏపీ సీఎం చంద్రబాబు
  • ఏపీ ప్రభుత్వం తరపున చినరాజప్ప హాజరు
  • ‘ఎట్ హోం’లో పాల్గొన్న ఏపీ, తెలంగాణ నేతలు 
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ఈరోజు సాయంత్రం ‘ఎట్ హోం’ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ విందుకు తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు, ప్రతిపక్ష నేత జానారెడ్డి, టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీ-బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, హైకోర్టు సీజే జస్టిస్ రాధాకృష్ణన్ హాజరయ్యారు. అయితే, ‘ఎట్ హోం’కు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హాజరుకాలేదు. ఏపీ ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం చినరాజప్ప హాజరయ్యారు. ఇంకా, ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు నేతలు, ప్రముఖులు పాల్గొన్నారు. 

rajbhavan
narasimhan

More Telugu News